NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: NEET Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ ఘటనపై కామారెడ్డి పట్టణంలో (kamareddy) కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఇందిరాగాంధీ చౌక్ వద్ద యూత్ కాంగ్రెస్ (Youth Congress) నియోజకవర్గ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

NEET Paper Leak | విద్యార్థుల జీవితాలతో చెలగాటం..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. పేపర్ లీక్‌లతో (neet exam controversy) వారి జీవితాలు దెబ్బతింటున్నాయన్నారు. నీట్​ లాంటి కీలక పరీక్షలు లీక్ జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని, దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే కొందరు అక్రమాలకు పాల్పడి వ్యవస్థను అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, పారదర్శక పరీక్షా విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీక్‌ల వెనుక ఉన్నవారిని గుర్తించి శిక్షించాలని, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, రూరల్ అధ్యక్షుడు రాజా గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామ్ కుమార్, షేరు, సిద్దిక్, యూనుస్ తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Bandi Bhagirath POCSO Case| భగీరథ్ పోక్సో కేసులో ఊహించని మలుపు.. బాధితురాలి వయసుపై కోర్టులో సంచలన వాదనలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *