నిజామాబాద్Nizamabad Ring Road | నగరానికి రింగ్​ రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్యే ధన్​పాల్​

Nizamabad Ring Road | నగరానికి రింగ్​ రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్ నగరానికి రింగ్​ రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ధన్​పాల్ అన్నారు. రాష్ట్రంలో మూడు జిల్లాలకు కేటాయించారని.. అందులో నిజామాబాద్​ లేదన్నారు.

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Ring Road | నిజామాబాద్ నగరానికి రింగ్ ​రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ధన్​పాల్ (mla dhanpal) అన్నారు. రాష్ట్రంలో మూడు జిల్లాలకు కేటాయించారని.. అందులో నిజామాబాద్​ నగరం (Nizamabad City) లేదన్నారు. నగరంలోని ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని గురువారం ప్రారంభించారు.

Nizamabad Ring Road | కమ్యూనిటీ హాల్​ నిర్మించుకోవడం అభినందనీయం..

ప్రభుత్వంపై ఆధారపడకుండా కాలనీవాసులు ఐక్యతతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే ధన్​పాల్​ అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలోకెల్లా అత్యధికంగా వ్యాపారులు, మేధావులు, విద్యావంతులు ఎన్జీవోస్ కాలనీలోనే (NGOs Colony) ఉన్నారన్నారు. అందరి కృషితోనే అద్భుతమైన నిర్మాణం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని, తన ఎమ్మెల్యే ఫండ్ వచ్చిన తర్వాత తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. తన ట్రస్ట్​ ద్వారా సాయం అందించడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఇప్పటికే పాత పనులపై అనేకసార్లు మంత్రులు, అధికారులను కలిశానన్నారు. త్వరలోనే సీఎంని కలిసి నగరాభివృద్ధి కోసం లేఖను అందించనున్నట్లు చెప్పారు. ఎలక్షన్ల ముందే రాజకీయమని, తర్వాత అందరినీ కలుపుకొని అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్​ సహకారంతో కేంద్ర నిధులు పుష్కలంగా అందుతున్నాయన్నారు.

Nizamabad Ring Road | వరంగల్​ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్​..

రాష్ట్రంలో వరంగల్ (Warangal) తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ అని, అయినా నగరానికి రింగ్​రోడ్డు మంజూరు చేయలేదన్నారు. అలాగే రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా స్పెషల్ ఫండ్ మంజూరు కాని నియోజకవర్గం కూడా నిజామాబాద్​ అర్బన్ ​(Nizamabad Urban) అని ఆయన పేర్కొన్నారు. పక్కనే ఉన్న రూరల్​కు​ సైతం ఫండ్​ ఇస్తున్నారని.. ఇందూరుపై మాత్రం వివక్ష చూపుతున్నారని చెప్పారు.

కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేటర్లు జ్యోతి, మురళి, నాగోల్ల లక్ష్మీనారాయణ, పరమేశ్వర్, మఠం పవన్, ప్రవీణ్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షుడు పోతనకర్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వాసు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Stock Market Rally | వాల్యూ బయ్యింగ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Grain Purchase Delay | ​ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి ఆగ్రహం

అక్షరటుడే, భీమ్​గల్: Grain Purchase Delay | ధాన్యం కొనుగోలు (paddy...

Green CementTech 2026|హైదరాబాద్‌లో ‘గ్రీన్ సిమెంటెక్’ ప్రారంభం.. ‘నెట్ జీరో’ సిమెంట్ తయారే లక్ష్యం

అక్షరటుడే వెబ్‌డెస్క్:Green CementTech 2026|పర్యావరణ హితమైన సిమెంట్ తయారీ , సాంకేతిక...

Formula E Race Case | ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌కు కోర్టు సమన్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | ఫార్ములా...

Nizamabad DRO Geetha | జిల్లా రెవెన్యూ అధికారిణికి ఘనసన్మానం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad DRO Geetha | జిల్లా రెవెన్యూ...