Elderly Man Missing | పోలీసుల కృషితో పాతికేళ్లకు సొంతింటికి చేరిన వృద్ధుడు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Elderly Man Missing | దాదాపు పాతికేళ్ల క్రితం తప్పిపోయిన ఓ వృద్ధుడు పోలీసుల కృషితో మళ్లీ సొంతింటికి చేరారు. కామారెడ్డి పట్టణ పోలీసులు (Kamareddy Police) శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Elderly Man Missing | జోగులాంబ గద్వాల్​ జిల్లా పూటన్​పల్లి..

జోగులాంబ గద్వాల్ జిల్లా (Jogulamba Gadwal District) పూటన్ పల్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల సత్యనారాయణ చారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ చారి 24 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. గురువారం రాత్రి కామారెడ్డి పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవి పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కనిపించిన సత్యనారాయణ చారి దగ్గర వివరాలు సేకరించారు. అనంతరం కామారెడ్డి పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. వెంటనే వారు గద్వాల్ పోలీస్ స్టేషన్​కు వివరాలను అందజేయగా వారు వివరాలు తెలుసుకొని గ్రామంలో విచారించి సత్యనారాయణ తప్పిపోయిన విషయం నిజమేనని నిర్దారించారు. తప్పిపోయిన వ్యక్తి ఫొటో చూసిన కుటుంబ సభ్యులు ఆయన సత్యనారాయణ చారిగా గుర్తుపట్టారు. దాంతో గద్వాల్ పోలీసులు కుటుంబ సభ్యులను కామారెడ్డి (kamareddy)కి పోలీస్ స్టేషన్​కు పంపించారు. శుక్రవారం ఉదయం పట్టణ సీఐ నరహరి (CI Narahari) సమక్షంలో సత్యనారాయణ చారిని వారి కుమారులకు అప్పగించారు. వృద్ధుని ఆచూకీ కనుగొన్న సిబ్బందిని సీఐ అభినందించారు.

ఇది కూడా చదవండి..: Negligent Driving Accident | నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలి..

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *