Bandi Bhagirath POCSO | ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వలేం.. బండి భగీరథ్​ కేసులో హైకోర్టు స్పష్టం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Bhagirath POCSO | POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన ఇంటరిమ్ ప్రొటెక్షన్ పిటిషన్‌పై హైకోర్టులో కీలక విచారణ జరిగింది.

కేసు విచారణ సందర్భంగా బాధితురాలు మైనర్ అని ఆమె జన్మించిన ఆసుపత్రి రికార్డుల ద్వారా పోలీసులు ధృవీకరించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలి వయసు 17 సంవత్సరాలు 3 నెలలేనని న్యాయమూర్తి నిర్ధారించారు.

Bandi Bhagirath POCSO | ఫిర్యాదు సమాచారం చేయడంతో..

విచారణలో బాధితురాలి తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. కేసు నమోదు కాకముందే నిందితుడి నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయని, బాధితురాలు ఫిర్యాదు చేయబోతుందన్న సమాచారం తెలుసుకుని కావాలనే ముందుగా కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని ఆరోపించారు. ఈ సమాచారాన్ని లోపల నుంచి ఎవరో అందించారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Bandi Bhagirath POCSO | ప్రధానమంత్రి బందోబస్తు కారణాన్ని సాకుగా

సంగప్ప అనే వ్యక్తి ద్వారా ఏప్రిల్ 23న బండి సంజయ్‌తో బాధిత కుటుంబానికి సమావేశం ఏర్పాటు చేశారని, ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించారని న్యాయవాది వాదించారు. ప్రధానమంత్రి బందోబస్తు కారణాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వం నిందితుడిని కాపాడిందని ఆరోపించారు. కేసు ఎందుకు నమోదు కాలేదని ముఖ్యమంత్రి సైతం డీజీపీని ప్రశ్నించినట్లు తెలిపారు.

ఇక నిందితుడి కుటుంబం నుంచి బెదిరింపులు వచ్చాయని, “నా కుటుంబం జోలికి వస్తే అంతు చూస్తా” అంటూ నిందితుడి తండ్రి బహిరంగ హెచ్చరికలు చేశారని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

రూ.50 వేల వ్యవహారంపై కూడా కోర్టులో చర్చ జరిగింది. బాధితురాలు డబ్బులు తీసుకుందనే ఆరోపణలను ఖండించిన న్యాయవాది, నిందితుడు ముందస్తు సమాచారం లేకుండా డబ్బు పంపించాడని, వెంటనే బాధితురాలు ఆ మొత్తాన్ని తిరిగి పంపిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.

Bandi Bhagirath POCSO | బాధితులుగా మరో నలుగురు యువతులు

బండి భగీరథ్‌పై గతంలో కూడా పలువురిపై దాడులకు సంబంధించిన కేసులు ఉన్నాయని, ఇంకా మరో నలుగురు యువతులు కూడా బాధితులుగా బయటకు వచ్చే అవకాశం ఉందని బాధితురాలి తరపు న్యాయవాది పేర్కొన్నారు.

ఇక నిందితుడి తరపు న్యాయవాది మాత్రం బెయిల్ పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే వెకేషన్ బెంచ్ సమయంలో 482 సీఆర్పీసీ కింద ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడం సాధ్యం కాదని బాధితురాలి తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు అరెస్టు చేయొద్దని తాను ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. తదుపరి విచారణను వచ్చే వెకేషన్ బెంచ్‌కు వాయిదా వేశారు.

Telangana Udyamakarula Committee | తెలంగాణ ఉద్యమకారులకు ‘రాజ గౌరవం’.. జర్నలిస్టులకు గుర్తింపు లభించేనా..?

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *