నిజామాబాద్Kamareddy Municipality | రోడ్డు పక్కన కూరగాయల విక్రయాలకు చెక్.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

Kamareddy Municipality | రోడ్డు పక్కన కూరగాయల విక్రయాలకు చెక్.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

కామారెడ్డిలో రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తున్నారు. దీనిపై అక్షరటుడేలో కథనం ప్రచురితం కావడంతో మున్సిపల్​ ఛైర్​పర్సన్​ స్పందించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality | రోడ్డుపై కూరగాయల విక్రయానికి మున్సిపల్ ఛైర్​పర్సన్​ పుల్​స్టాప్ పెట్టారు. కామారెడ్డి (Kamreddy City) పట్టణంలోని సీఎస్ఐ మైదానం ఎదురుగా రోడ్లపైనే కూరగాయాలు విక్రయిస్తున్నారు. ఈ విషయమై.. ‘పట్టణంలో రాత్రిపూట రోడ్డు పక్కనే కూరగాయల విక్రయాలు’ శీర్షికన ఈనెల 11 న ‘అక్షరటుడే’లో(Akshara Today) కథనం ప్రచురితమైంది.

Kamareddy Municipality | స్పందించిన మున్సిపల్​ ఛైర్​పర్సన్​

దీంతో కామారెడ్డి(Kamareddy) మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి స్పందించారు. తైబజార్ నిర్వహిస్తున్న వారితో ఫోన్​లో మాట్లాడారు. ప్రధాన రహదారి పక్కన కూరగాయలు విక్రయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్లపై విక్రయాలు నిలిపివేయాలని సూచించారు. సీఎస్ఐ మైదానంలో (CSI Ground) ఎగ్జిబిషన్ (Exhibition) ఏర్పాటుతో కూరగాయలు విక్రయించలేని పరిస్థితిని తైబజార్ నిర్వాహకులు ఛైర్​పర్సన్​కు చెప్పగా రోడ్డుకు ఎగ్జిబిషన్​కు మధ్య చాలా స్థలం ఖాళీగా ఉంటుందన్నారు. అందులో కూరగాయలు విక్రయించేలా చూడాలని సూచించడంతో రోడ్డుపై కూరగాయల విక్రయాన్ని తక్షణమే నిలిపివేశారు. సీఎస్ఐ మైదానంలో కూరగాయల విక్రయానికి రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయమై ఛైర్​పర్సన్ మాట్లాడుతూ.. రైతులకు ప్రమాదం పొంచి ఉన్న విషయంపై తైబజార్ వాళ్లతో మాట్లాడినట్లు తెలిపారు. బిజీ షెడ్యూల్ వల్ల నేరుగా వెళ్లలేకపోయానని, ఫోన్ ద్వారా సమస్య పరిష్కరించినట్టు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Vijayawada Doctor Case | విజయవాడలో సంచలనం.. పెళ్లి విషయం దాచిపెట్టి నర్సును మోసం చేశాడన్న ఆరోపణలు.. వైద్యుడిపై కేసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bhogapuram Airport Protest | రోడ్డు పనులు అడ్డుకున్న రైతులు.. జేసీబీ బకెట్​తో పక్కకు తొలగించిన అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhogapuram Airport Protest | ఏపీలోని విజయనగరం...

Fake IPL Ticket Apps | నకిలీ యాప్​ల్లో ఐపీఎల్​ టికెట్స్​.. సీపీ సజ్జానర్​ హెచ్చరిక

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake IPL Ticket Apps | దేశవ్యాప్తంగా ఐపీఎల్​...

Dengue Prevention Tips | దోమల నిర్మూలనపై నిర్లక్ష్యం చేయవద్దు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Dengue Prevention Tips | వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో...

RTI Act | కామారెడ్డి బల్దియాలో స.హ.చట్టం అమలుపై నిర్లక్ష్యం..

అక్షరటుడే, కామారెడ్డి: RTI Act | మున్సిపల్ కార్యాలయంలో (Kamareddy Municipality)...