CBSE Three Language Rule | CBSC బోర్డు కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు కొత్త త్రీ-లాంగ్వేజ్ రూల్..

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CBSE Three Language Rule | సీబీఎస్ఈ బోర్డు (CBSE Board) కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 9, 10వ తరగతుల్లో ఇప్పటి వరకు విద్యార్థులకు సాధారణంగా రెండు భాషలు మాత్రమే ఉండేవి. ఇందులో ఇంగ్లిష్​, తెలుగు లేదా హిందీ ఉండేంది. కాగా.. తాజా నిర్ణయంతో సీబీఎస్ఈ నూతన లాంగ్వేజ్ 2026 నుంచి పదో తరగతి విద్యార్థులు మూడు భాషలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే థర్డ్ లాంగ్వేజ్ (Third Language)​గా సెలెక్ట్​ చేసుకున్న సబ్జెక్టుకు సంబంధించి బోర్డు పరీక్ష  రాయాల్సిన అవసరం లేదు.

CBSE Three Language Rule | కొత్త సర్క్యులర్ వివరాలివే..

సీబీఎస్​ఈ 9, 10 తరగతుల విద్యార్థుల లాంగ్వేజ్ అధ్యయనం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త పద్ధతి అమలులోకి రానుంది. లాంగ్వేజ్ విద్య అనేది నూతన జాతీయ విద్యావిధానం 2020 ఎన్​సీఈఆర్​టీ అప్ గ్రేడ్ చేసిన ప్రణాళికకు అనుగుణంగా ఉండనుంది.

CBSE Three Language Rule | మూడు భాషల ఎంపిక

నూతన విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి స్టూడెంట్స్​ మూడు భాషలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో రెండు భారతీయ భాషలై ఉండాలి. మూడో భాషగా ఒక విదేశీ భాషను ఎంచుకునేందుకు ఛాన్స్ ఉంటుందని బోర్డు తెలిపింది. ఈ విధానం 1 జులై 2026 నుంచి అమల్లోకి తీసుకురానుంది.

CBSE Three Language Rule | నాలుగో భాషగా కూడా..

విదేశీ భాషను అభ్యసించాలనుకునే విద్యార్థులు, రెండు భారతీయ భాషలు అయితేనే దానిని మూడోది విదేశీ భాషగా ఎంచుకునే ఛాన్స్​ కల్పించింది. అయితే విద్యార్థులు కోరుకున్నట్లయితే నాలుగో భాషగా కూడా అభ్యసించవచ్చని బోర్డు వెల్లడించింది. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే టెన్త్​లో ఎంపిక చేసుకున్న థర్డ్ లాంగ్వేజ్ సంబంధించి బోర్డు పరీక్షను నిర్వహించకూడదని సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి..: Telangana ANM Results | ఏఎన్​ఎం పరీక్ష ఫలితాలు విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *