అక్షరటుడే, కామారెడ్డి: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్ సమర్పించి అక్రమంగా టీఎఫ్టీ లైసెన్స్ పొందారనే ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు జిల్లా ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.
Illegal Toddy License | తెలంగాణ హైకోర్టులో..
తెలంగాణ హైకోర్టులో దాఖలైన కేసులో ఏప్రిల్లో వెలువడిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి హన్మంత్ రావు తెలిపారు. ఈ మేరకు తాడ్వాయి మండలం కరడ్పల్లి గ్రామానికి చెందిన కె. స్వామిగౌడ్, ఎస్.సంపత్ కుమార్‌లకు నోటీసులు అందజేశారు. వీరిద్దరూ ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి (Kamareddy) కలెక్టరేట్లోని జిల్లా ఎక్సైజ్ అధికారి ఛాంబర్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. తమ వాదనకు మద్దతుగా ఉన్న అన్ని సహాయక పత్రాలను విచారణ సమయంలో సమర్పించాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి..: BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతకు వెలికితీయడంలో బాల్భవన్ పాత్ర గొప్పది: కలెక్టర్ ఇలా త్రిపాఠి


