తెలంగాణBandi Bhageerath POCSO | బండి భగీరథ్​ ఎక్కడ ఉన్నాడో సీఎంకు తెలుసు : ఆర్​ఎస్​...

Bandi Bhageerath POCSO | బండి భగీరథ్​ ఎక్కడ ఉన్నాడో సీఎంకు తెలుసు : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

బీఆర్​ఎస్​ నాయకుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడో రేవంత్ రెడ్డికి తెలుసన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhageerath POCSO | బీఆర్​ఎస్​ నాయకుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడు అనేది కేంద్ర మంత్రి అయిన భగీరథ్​ తండ్రికి, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మాత్రమే తెలుసన్నారు.

ప్రవీణ్​కుమార్​ తెలంగాణ భవన్​లో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. భగీరథ్​పై పోక్సో కేసు నమోదు అయి 9 రోజులు గడుస్తున్నా.. పోలీసులు ఇంకా అతడిని అరెస్ట్​ చేయలేదన్నారు. కానీ జర్నలిస్ట్​లు, బీఆర్​ఎస్​ నాయకులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేస్తారని విమర్శించారు. ‘‘తన కొడుకు బాలికపై వేధింపులకు పాల్పడ్డట్లు కేంద్ర మంత్రి సంజయ్​ సీఎం రేవంత్​రెడ్డి ముందే చెప్పాడు’ అని ప్రవీణ్​కుమార్ అన్నారు.

Bandi Bhageerath POCSO | నిస్సహాయ సీఎం

ప్రధాన మంత్రి (PM Visit) పర్యటన బందోబస్త్ కార్యక్రమంలో పోలీసులు బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నారని ఆయన అన్నారు. అయితే ఈ బందోబస్త్​లో ఎక్కడా కూడా పేట్ బషీరాబాద్ ఏసీపీ, డీసీపీ పాల్గొనలేదన్నారు. బందోబస్త్​లో 10 వేల మంది పాల్గొంటే రాష్ట్రంలోని మిగతా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రవీణ్​ కుమార్​ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిస్సహాయ ముఖ్యమంత్రిగా, నిస్సహాయ హోంమంత్రిగా నిందితుడిని అప్పగించాలని ఆయన తండ్రిని అడుక్కుంటున్నారని విమర్శించారు.

Bandi Bhageerath POCSO | బాలిక పరిస్థితి ఏమిటి

భగీరథ్​పై నమోదైన పోక్సో కేసులో తన పేరు వాడొద్దని ఆయన తండ్రి కోర్టు నుంచి గ్యాగ్​ ఆర్డర్​ తెచ్చుకున్నారని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. అయితే బాలిక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె ఫొటోలు వాడొద్దని కోర్టులో ఎవరు కోరుతారని ప్రశ్నించారు. బాలికకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పోక్సో కేసులో భగీరథ్​ను కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

 

దీనిని కూడా చదవండి : Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన మనవడు.. కాపాడబోయి తాత మృతి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhageerath Surrender | పోక్సో కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన బండి భగీరథ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhageerath Surrender | తనపై నమోదు...

Silver Import Restrictions | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వెండి దిగుమతులపై ఆంక్షలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Silver Import Restrictions | కేంద్ర ప్రభుత్వం...

Bheemgal Town | పట్టణ అభివృద్ధికి అందరి సహకారం అవసరం..

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal Town | ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పట్టణంలోని...