Telangana Weather Update | దంచికొట్టిన వాన.. ఈ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు..

Naresh Chandan
Telangana Weather Update

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Weather Update | తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. వడగళ్లు కూడా కురిసి వాతావరణాన్ని పూర్తిగా చల్లబర్చింది.

గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న మహా నగర వాసులు.. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.Heavy Rain Alert

Telangana Weather Update | ఈ జిల్లాల్లో వర్షాలు..

రానున్న కొన్ని గంటల్లో రాష్ట్రంలోని లు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి.

ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి వర్షపాతం ఉండదని, పొడి వాతావరణం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

Hailstorm Rain |
Hailstorm Rain | కామారెడ్డిలో వడగళ్ల వాన..ఆందోళనలో రైతన్న

రేపు ఇలా..

అయితే ,రేపటి పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విడతల వారీగా తీవ్ర ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *