తెలంగాణTelangana Heat Wave | మండుతున్న ఎండలు.. 7 జిల్లాలకు రెడ్​ అలెర్ట్​

Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. 7 జిల్లాలకు రెడ్​ అలెర్ట్​

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రానున్న నాలుగు రోజులు ఎండతీవ్రత మరింత ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heat Wave | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.

రాష్ట్రంలో హీట్​ వేవ్​ ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లకు రెడ్ అలర్ట్ జారీ చేశార. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని సూచించారు. నీరు ఎక్కువగా తాగాలని, అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని కోరారు.

Telangana Heat Wave | వడగాలులు వీస్తాయి

పలు జిల్లాల్లో సోమవారం వడగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల (Jagtial), మంచిర్యాల కామారెడ్డి జిల్లాల్లో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఇతర ప్రాంతాల్లో 42-44°C ఉష్ణోగ్రతలతో కూడిన ‘తేమతో కూడిన వేడి’ ఉంటుందని పేర్కొన్నారు.

Telangana Heat Wave | వర్ష సూచన

ఎండలు మండుతున్నా.. రెండు, మూడు రోజులుగా రోజులుగా సాయంత్రం పూట వాతావరణం చల్లబడుతోంది. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో సాయంత్రం పూట ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ మరియు నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈ వర్షాలు గాలిలో తేమ శాతాన్ని పెంచుతాయి. దీంతో ఉక్కపోత మరింత పెరగనుంది.

ఇది కూడా చదవండి..: Youth Sports Festival | నేటి నుంచి క్రీడా – యువజన వారోత్సవాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Car Accident | అదుపుతప్పి కారుబోల్తా.. వైద్యుడికి గాయాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Car Accident | కారు అదుపు తప్పి...

India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Nordic Summit | విదేశీ పర్యటనలో...

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...