అక్షరటుడే, వెబ్డెస్క్: KBR Park | హైదరాబాద్ (Hyderabad)లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) జాతీయ పార్కు చుట్టూ చెట్లు నరకొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పార్క్ పరిరక్షణకు సంబంధించిన అంశాన్ని సుప్రీం కోర్టు (Supreme Court) సోమవారం విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) State Governmentకేబీఆర్ పార్కు వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వందలాది చెట్లను నరికి వేస్తున్నారు. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ ప్రేమికులు చెట్లు నరకొద్దని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఉజ్జల్ భూయాన్ సోమవారం వాదనలు విన్నారు.
KBR Park | జులై 27కు వాయిదా
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది కేబీఆర్ పార్క్ పరిరక్షణకు సంబంధించినదన్నారు. 1300 చెట్లను నరికేస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు 50 చెట్లు కొట్టేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లను నరకవద్దని గతంలో ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం చెట్లు నరుకుతోందన్నారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జులై 27కు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు కేబీఆర్ జాతీయ ఉద్యానవనం పరిధిలోని పర్యావరణ సున్నిత ప్రాంతంలో (25 నుండి 35 మీటర్ల వరకు) చెట్లను నరకొద్దని ఆదేశించింది. దీంతో కేబీఆర్ వద్ద ప్రస్తుతం చేపడుతున్న పనులు ఆగిపోనున్నాయి.
ఇది కూడా చదవండి..: Disaster Management Drill | ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యం : మంత్రి పొంగులేటి


