MP Arvind Comments | మోదీకి, రేవంత్​కు లింక్​ ఉందేమో.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: MP Arvind Comments | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ప్రధాని మోదీకి ఏమైనా లింకులు ఉన్నాయేమో అని ఎంపీ అర్వింద్​ అన్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్​లో సువేంద్​ అధికారిలా మోదీ, రేవంత్​ కలుస్తారేమోనని అర్వింద్ అన్నారు. అందుకే నాతో కలిసి పని చేయి అన్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కాగా బెంగాల్​లో సువేంద్​ అధికారి తృణమూల్​ నుంచి బీజేపీలో చేరారు. ఇటీవల హైదరాబాద్​లో జరిగిన కార్యక్రమంలో తనతో కలిసి పని చేయాలని రేవంత్​రెడ్డిని మోదీ కోరారు. ఈ క్రమంలో  ఎంపీ అర్వింద్​ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

MP Arvind Comments | వాళ్లను సీఎం చేయాలి

ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన పీఎం మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించిన సందర్భంగా ఎంపీ పై వ్యాఖ్యలు చేశారు. 2039 వరకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని కారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని.. అంటే రాహుల్ ఇక ప్రధాని కాలేరని.. ఇంకో పదేళ్లు దేశంలో బీజేపీ ఉంటుందని సీఎం రేవంత్​రెడ్డే ఒప్పుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి బదులు కోమటి రెడ్డి, శ్రీధర్​బాబు లాంటి వాళ్లను సీఎం చేయాలని కాంగ్రెస్​కు సూచించారు. వారైతే మొదటి నుంచి కాంగ్రెస్​లో ఉన్నారని చెప్పారు.

MP Arvind Comments | సీఎం నిజామాబాద్​కు పంగనామాలు పెట్టిండు..

సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కు పంగనామాలు పెట్టాడాని ఎంపీ విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్​ను రాజకీయంగా అణగదొక్కేందుకు సీఎం జిల్లాకు మొండిచేయి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో తిరుగుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు. నిజామాబాద్​కు అవుటర్ రింగ్ రోడ్డు ఇస్తా అని హామీ ఇచ్చిన సీఎం తర్వాత మరిచిపోయారన్నారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే భవిష్యత్తులో వారు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. దేవుళ్లను మోసం చేసిన వాడికి ప్రజలు ప్రజలను మోసం చేయడం పెద్ద లెక్క కాదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తికావని జోస్యం చెప్పారు. ఇప్పటివరకు 25 శాతం పనులు కూడా పూర్తికాలేదని.. రూ.162 కోట్లకు గాను కేవలం రూ.10 కోట్ల నిధులు మాత్రమే యూజీడీకి ప్రభుత్వం కేటాయించిందన్నారు.

ఇది కూడా చదవండి..: Leopard Attack in Yellareddy | తాడ్వాయిలో చిరుత కలకలం.. లేగ దూడలపై దాడి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *