నిజామాబాద్Indiramma House | కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తానని వేధింపులు.. కాంగ్రెస్​ నాయకుడిపై పోలీసులకు...

Indiramma House | కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తానని వేధింపులు.. కాంగ్రెస్​ నాయకుడిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ కాంగ్రెస్​ నాయకుడు వేధిస్తున్నాడని ఓ మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. చివరకు బాధిత మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma House | ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ కాంగ్రెస్​ నాయకుడు వేధిస్తున్నాడని ఓ మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. చివరకు బాధిత మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ ఘటన రాజంపేట (Rajampet) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆమె సోమవారం వివరాలు వెల్లడించింది.

Indiramma House | ఇందిరమ్మ ఇల్లు కావాలని మొరపెట్టుకోగా..

రాజంపేటకు చెందిన బాధిత మహిళకు ఇల్లు కూలిపోయి రెండేళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఇందిరమ్మ ఇల్లు కావాలని నాయకులకు మొరపెట్టుకుంది. అయితే సదరు కాంగ్రెస్ నాయకుడు తన కోరిక తీరిస్తేనే ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పడంతో ఆమె నిరాకరించింది. దీంతో డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల (Double-bedroom houses) మంజూరు జాబితాలో బాధిత మహిళ పేరు వచ్చినా సదరు కాంగ్రెస్ నాయకుడు క్యాన్సిల్ చేయించాడని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. సదరు నాయకుని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Indiramma House | తప్పు చేస్తే దేనికైనా సిద్ధమే.. కాంగ్రెస్ నాయకుడి వివరణ

అయితే తనపై వచ్చిన ఆరోపణలపై సదరు నాయకుడు స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఆమెకు ఇల్లు కూలిపోతే పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. అయితే ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత తనకు లేదని, డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని కోరితే మొదటి లిస్టులోనే ఆమెకు ఇల్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అయితే కొందరు వ్యక్తులు సంబంధిత అధికారులకు చెప్పి ఆమె పేరు క్యాన్సిల్ చేయించారన్నారు.

అయితే రాజంపేటలో వర్షాలు పడి ఓ మహిళ ఇల్లు కూలిపోతే ఆమెకు రూ.10 వేలు ఆర్థిక సహాయం ఇప్పించామన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయిస్తామని తమ మాజీ అధ్యక్షుడు హామీ ఇచ్చారన్నారు. అయితే ఆ మహిళకు ఇల్లు ఎలా మంజూరు చేస్తారని తన ఎందుకు ఇవ్వరని పేర్కొంటూ బాధిత మహిళ తనను ఆర్నెళ్లుగా మానసికంగా వేధిస్తోందని తెలిపారు. తాను 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. ఈ విషయమై పోలీసులు నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. తాను తప్పు చేస్తే దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Realme Phone Prices | పెరిగిన రియల్​ మీ ఫోన్ల ధరలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...