అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: GGH Mock Drill | వరదలు, ఇతర విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీజీహెచ్‌లో సోమవారం ఫ్లడ్ మార్క్ డ్రిల్ నిర్వహించారు. ఐసీఎస్ ఇన్‌ఛార్జి, ఆర్డీవో రాజేంద్ర కుమార్, జీజీహెచ్ (GGH Nizamabad) ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ నాగమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
GGH Mock Drill | రోగుల తరలింపు.. అత్యవసర సేవల సమన్వయం..
జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఫ్లడ్స్ సమయంలో (flood preparedness) తీసుకోవాల్సిన చర్యలపై వైద్యసిబ్బందికి అవగాహన కల్పించారు. ఆస్పత్రిలో ఆకస్మికంగా వరదలు సంభవిస్తే (disaster management drill) రోగులను సురక్షితంగా తరలించడం, అత్యవసర సేవల సమన్వయం, విభాగాల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ విధానాలపై ప్రాక్టికల్‌గా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రిసిటీ, ఎన్సీసీ (NCC), ఆపద మిత్ర, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖ, వైద్యారోగ్యశాఖ శాఖ అధికారులు, 108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజశేఖర్, సరస్వతి, నర్సింగ్ సూపరింటెండెంట్ లలిత, ఆస్పత్రి సిబ్బంది, 108 బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Peddi Trailer | ‘పెద్ది’ ట్రైలర్‌కు భారీ స్పందన.. రామ్ చరణ్ మాస్ అవతార్‌కు ఫిదా అవుతున్న అభిమానులు


