హైదరాబాద్ACB Raids | జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూసి షాకైన అధికారులు

ACB Raids | జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూసి షాకైన అధికారులు

జలమండలి జనరల్ మేనేజర్​​ కుమార్​ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.100 కోట్ల మేర అక్రమాస్తులను గుర్తించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids | హైదరాబాద్​ (Hyderabad)లోని జలమండలి (HMWSSB)లో పని చేస్తున్న జనరల్ మేనేజర్​​ కుమార్​ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

రెడ్​హిల్స్​ డివిజన్​ జీఎంగా కుమార్​ పని చేస్తున్నారు. ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు అయింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు (ACB Officers) సికింద్రాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉన్న కుమార్ నివాసంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో అతడికి రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు.

ACB Raids | కిలో బంగారం స్వాధీనం

సోదాల సమయంలో జీఎం కుమార్​ ఇంట్లో అక్రమాస్తులను చూసి అధికారులు షాక్​ అయ్యారు. అతడి నివాసంలో రూ.1.10 కోట్ల నగదు, సుమారు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడికి హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్.. 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ (Nizamabad)లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ఇంకా పలు బ్యాంక్​ల్లో లాకర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిని ఓపెన్​ చేయనున్నారు. బ్యాంక్​ లాకర్లు ఓపెన్​ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: AI Social Media Surveillance | ఏఐతో సోషల్​ మీడియాపై నిఘా..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Property Tax | భువన్ సర్వేతో బయటపడ్డ కామారెడ్డి ఆస్తిపన్ను బకాయిలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Property Tax | కామారెడ్డి పురపాలక సంఘంలో...

MP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Anil kumar | నిజామాబాద్​ ఎంపీ...

Kamareddy Water Supply | నీటి సమస్య తీర్చిన ఘనత షబ్బీర్ అలీదే..: మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Water Supply |కామారెడ్డిలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి...

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...