తెలంగాణDharmapuri Arvind|జగిత్యాల బీజేపీ సీనియర్లపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆగ్రహం

Dharmapuri Arvind|జగిత్యాల బీజేపీ సీనియర్లపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆగ్రహం

జగిత్యాల బీజేపీ సీనియర్ నాయకుల తీరుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Dharmapuri Arvind|జగిత్యాల బీజేపీ సీనియర్ నాయకుల తీరుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్నా సమయంలో కార్యకర్తలను రోడ్డుపై వదిలేసి, కొందరు నాయకులు పోలీసులతో నవ్వుతూ కార్లలో వెళ్లిపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Dharmapuri Arvind|పోలీసులను పిలిపించుకుని అరెస్ట్ అయ్యారు..

జగిత్యాలలో జరిగిన ఘటనపై ఎంపీ అరవింద్ తీవ్రంగా స్పందించారు. “మా వాళ్లు ఇద్దరు ముగ్గురు సీనియర్ నాయకులు.. ధర్నా జరుగుతున్నప్పుడు తామున్న చోటికే పోలీసులను పిలిపించుకుని, కావాలనే అరెస్ట్ అయ్యారు.

Dharmapuri Arvind|నచ్చకపోతే ఇంట్లో కూర్చోండి..

పార్టీ కోసం సిన్సియర్‌గా పనిచేసే వాళ్లే ఉండాలని, లేదంటే ఇంట్లో కూర్చోవాలని అరవింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసులతో నవ్వుతూ, ముచ్చట్లు పెడుతూ, స్లోగన్లు ఇచ్చుకుంటూ కార్లలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి” అని అరవింద్ స్పష్టం చేశారు. “భారతీయ జనతా పార్టీలో సిన్సియర్‌గా పనిచేయండి.. లేదంటే ఇంట్లోనే కూర్చోండి. మిమ్మల్ని ఎవరూ రోడ్డుపైకి వచ్చి స్లోగన్లు ఇవ్వమని బతిమిలాడటం లేదు. మిమ్మల్ని పనిచేయమని ఎవరూ అడగట్లేదు. అంతేకానీ సొంత ప్రయోజనాల కోసం పార్టీకి నష్టం చేయొద్దు” అని హెచ్చరించారు.

Dharmapuri Arvind|నిజామాబాద్‌లో గట్టి పోటీ ఉంది..

రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావుతో మాట్లాడిన విషయాలను ప్రస్తావిస్తూ.. “నిజామాబాద్ పార్లమెంట్ స్థానం చాలా కీలకమైనది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చాయో.. మాకూ అంతే స్థాయిలో ఓట్లు వచ్చాయి. పార్టీలో క్రమశిక్షణ లేకపోతే నష్టం జరుగుతుంది” అని అరవింద్ పేర్కొన్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సదరు నాయకులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Madhya Pradesh Tour | మధ్యప్రదేశ్ మహా దర్శన్.. అద్భుతమైన టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చిన ఐఆర్‌సీటీసీ

 

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...

Power Supply Disruption | గాలివాన బీభత్సం.. 24 గంటలుగా విద్యుత్​ లేక అవస్థలు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Power Supply Disruption | మండలంలో సోమవారం సాయంత్రం...

Yellareddy Police | అన్నదాత బలవన్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | అనారోగ్యంతో రైతు ఉరివేసుకుని బలవన్మరణం...

Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Tank Repair Works | నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల...