అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జల మండలి అధికారులు తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని తమకు సహకరించాలని కోరారు.
పటాన్చెరు సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ఈ పనులు చేపడుతుండగా నగరానికి మంచినీరు సరఫరా చేసే మంజీరా ఫేస్ –2కు చెందిన భారీ 1500 mm తాగునీటి పైప్‌లైన్ దెబ్బతింది. దీనివల్ల నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Hyderabad Water Supply | పరిశీలించిన ఎండీ
పైప్‌లైన్ పగిలిపోగానే జలమండలి (HMWS SB) అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే నీటిసరఫరాను నిలిపి వేసి మరమ్మతులు ప్రారంభించారు. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మరమ్మతు పనులను పరిశీలించారు. అత్యవసర మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నీటి సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు.
Hyderabad Water Supply | ఈ ప్రాంతాల్లో నీళ్లు రావు
పైప్‌లైన్ పగిలిపోవడంతో మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, చందానగర్, లింగంపల్లి, ఆర్సీ పురం, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, అమీన్పూర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది. నీటి సరఫరా దశలవారీగా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : ACB Raids | జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూసి షాకైన అధికారులు