బిజినెస్​Today Stock Market | కోలుకున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

Today Stock Market | కోలుకున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో సాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 83 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today Stock Market | పశ్చిమాసియాలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుండడంతో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురవుతున్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళనలతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకు పాల్పడుతున్నారు.

బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారడంతో అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయితే కనిష్ట స్థాయిల వద్ద, పలు కంపెనీలలో వాల్యూ బయ్యింగ్‌కు ఆసక్తి చూపుతుండడంతో ఇండెక్స్‌లు భారీగా పడిపోవడం లేదు.

Today Stock Market | ఒడిదుడుకులు..

బుధవారం ఉదయం సెన్సెక్స్ 394 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 277 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 520 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో ప్రారంభమెనా 60 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 185 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 83 పాయింట్ల నష్టంతో 75,117 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 23,601 వద్ద ఉన్నాయి.

Today Stock Market | మిశ్రమంగా..

నిఫ్టీ (Nifty)లో ఆటో ఇండెక్స్ 0.71 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.55 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.53 శాతం, పవర్ 0.41 శాతం లాభాలతో, మీడియా ఇండెక్స్ 1.50 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.71 శాతం, యుటిలిటీ 0.53 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.50 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎంఅండ్ ఎం 0.94 శాతం, రిలయన్స్ 0.82 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.73 శాతం, ఎల్టీ 0.48 శాతం, టీసీఎస్ 0.29 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బీఈఎల్ 2.68 శాతం, టాటా స్టీల్ 2.32 శాతం, ఎటర్నల్ 0.93 శాతం, ఐటీసీ 0.77 శాతం, ట్రెంట్ 0.53 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: May 20 Gold Rates | పెరిగిన పసిడి ధర.. తగ్గిన వెండి రేట్​!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...