Paddy Procurement Delay | నెలలుగా కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు.. ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టిన రైతు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Paddy Procurement Delay | అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మగ్గిపోతుండడంతో విసుగు చెందిన కొందరు రైతులు ధాన్యానికి నిప్పు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం రామారెడ్డి (ramareddy) మండలం ఇసన్నపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ఓ రైతు ధాన్యానికి నిప్పు పెట్టిన ఘటన మర్చిపోకముందే మంగళవారం రాత్రి మళ్లీ అలాంటిదే మరో ఘటన జరిగింది.

Paddy Procurement Delay | రామారెడ్డి మండలం రాజమ్మ తండాలో..

రామారెడ్డి మండలం రాజమ్మ తండాకు చెందిన రైతు ల్యాగల నరేష్ వరి ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. కాంటా అయినప్పటికీ రైస్ మిల్లులకు ధాన్యం తరలించకపోవడంతో ఆగ్రహంలో నిప్పంటించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి ఆర్డీవో గిరి (Kamareddy RDO Giri) వెంటనే కొనుగోలు కేంద్రానికి చేరుకుని వివరాలు సేకరించారు. రైతులు ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి చాలా రోజులవుతున్నా కాంటాలు సరిగా చేయడం లేదని, కాంటా అయిన ధాన్యాన్ని కూడా రైస్​మిల్లులకు తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఏపీఎం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆర్డీవో గిరి, వరి ధాన్యం కాంటాలు పూర్తయ్యేలా, కాంటా అయిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Cancer Drug Smuggling|క్యాన్సర్ మందుల అక్రమ రవాణాపై ఢిల్లీ హైకోర్టు ఫైర్.. కేంద్రం, CDSCO లకు కోర్టు నోటీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *