అక్షరటుడే వెబ్‌డెస్క్:Caste Census Support|దేశంలో కులగణనకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ తీర్పు ఎంతో చారిత్రాత్మకమైనదని కొనియాడిన ఆయన, దేశంలోని 60 కోట్ల మంది ప్రజలకు న్యాయం చేసిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన ప్రక్రియను చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలు (బీసీలు) ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని వీహెచ్ విమర్శించారు.
Caste Census Support|పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..
జనగణనలో కులాల వారీగా వివరాలు సేకరించడాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది. జనాభా లెక్కల్లో కులగణనను చేర్చాలా వద్దా అనేది ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. సమాజంలో వెనుకబడిన వర్గాల జనాభా ఎంత ఉందో తెలుసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.
Caste Census Support|మోదీ సలహాలు మాకు అవసరం లేదు..
అంతర్జాతీయ పరిస్థితులను బట్టి దేశ ప్రజలంతా పొదుపు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై వీహెచ్ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ తమకు ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, 18వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిరావ్ ఫూలే తమకు అన్ని విషయాలు నేర్పించారని అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ఇంధన ధరలను పెంచిందని.. గతంలో తెచ్చిన నోట్ల రద్దు (డీమానిటైజేషన్) నిర్ణయం వల్ల దేశ ప్రజలు రోడ్డున పడ్డారని ఆయన మండిపడ్డారు.
ఇది కూబా చదవండి: UP Encounters | అక్కడ రోజుకు ఐదు ఎన్‌కౌంటర్లు కామన్.. నేరస్తుల గుండెల్లో వణుకుపుట్టించిన యోగి


