Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఒక ఒప్పందానికి రెడీ అవుతున్నట్లు కనిపించంతో భారీ లాభాల దిశా సాగిన మార్కెట్లు.. అంతలోనే ట్రంప్ శైలిపై అనుమానంతో నేలచూపులు చూస్తున్నాయి. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.

Stock Market Gains | లాభాలతో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం లాభాలతో ప్రారంభమై భారీ లాభాల దిశగా సాగినా.. కొద్దిసేపటికే ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. ఉదయం సెన్సెక్స్ 414 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 213 పాయింట్లు పెరిగిTంది. అక్కడినుంచి 585 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో ప్రారంభమె మరో 29 పాయింట్లు ఎగబాకింది. అక్కడినుంచి 155 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 75,470 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 23,732 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | టెలికాం, క్యాపిటల్ గూడ్స్‌లో కొనుగోళ్లు..

నిఫ్టీ (Nifty)లో టెలికాం ఇండెక్స్ 1.57 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.25 శాతం, పవర్ 0.98 శాతం, రియాలిటీ 0.80 శాతం, యుటిలిటీ 0.65 శాతం, ఆటో 0.55 శాతం, మెటల్ 0.51 శాతం లాభాలతో, ఎఫ్ ఎంసీజీ 0.23 శాతం, ఐటీ 0.25 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో, 112 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో 3.41 శాతం, బీఈఎల్ 1.78 శాతం, పవర్‌గ్రిడ్ 1.12 శాతం, టాటా స్టీల్ 1.04 శాతం, ఎల్టీ 0.98 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్ ఫైనాన్స్ 1.39 శాతం, హెచ్యూఎల్ 0.86 శాతం, టెక్ మహీంద్రా 0.74 శాతం, ఇన్ఫోసిస్ 0.69 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.47 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: UPI PF Withdrawal | త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *