నిజామాబాద్Rajiv Gandhi Tribute | యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఘనత రాజీవ్​దే :...

Rajiv Gandhi Tribute | యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఘనత రాజీవ్​దే : డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

యువత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే విధంగా ఓటు హక్కును 18 ఏళ్లకు కుదించిన ఘనత రాజీవ్ గాంధీదేనని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ భవన్​లో రాజీవ్​ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.

అక్షరటుడే, ఇందూరు: Rajiv Gandhi Tribute | యువత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే విధంగా ఓటు హక్కును 18 ఏళ్లకు కుదించిన ఘనత రాజీవ్ గాంధీదేనని (Rajiv Gandhi) డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్​లో (Congress Bhavan) రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జీజీహెచ్​లో(Nizamabad GGH) పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Rajiv Gandhi Tribute | రాజీవ్​ హయాంలో పెను మార్పులు

రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో పెను మార్పులు తీసుకొచ్చారని.. మహాత్మా గాంధీ ఆశయం మేరకు గ్రామాల్లో పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ హోదా కల్పించారన్నారు. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని యువకులకు ఓటు హక్కును 18 ఏళ్లకు కుదించారన్నారు. టెలీ కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీనేనని అన్నారు.

Rajiv Gandhi Tribute | టెక్నాలజీకి బ్రాండ్​ రాజీవ్​గాంధీ..

భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి నడిపించిన మహా నాయకుడు రాజీవ్ అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేశారన్నారు. ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ అన్నింటికీ పునాది వేసింది రాజీవ్ గాంధీనేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్ తాహెర్ బిన్ హాందాన్, మేయర్ ఉమారాణి (Mayor Umarani), పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవత్సలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తారాచాంద్, కౌడపు శరత్, వేంపల్లి రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, కంజర్ రవి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఏసీ అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ ఛైర్మన్ శ్రీనివాస్, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి, సీనియర్ నాయకులు మీసాల సుధాకర్, జావీద్ అక్రమ్, నగర కాంగ్రెస్ కోశాధికారి సకినాల శివ ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు రవి, ముల్గురి గణేష్, లింబాద్రి సుభాష్, పులి వెంకటేశ్వర రావు, ఏఎంసీ డైరెక్టర్ రఘు, జెండా గుడి ఛైర్మన్ లవంగ ప్రమోద్, అవిన్, సంగెం సాయిలు, కిష్టాగౌడ్, పోలా ఉష, అపర్ణ, స్వప్న, బంటు బలరాం తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

RBI Recovery Rules|రికవరీ ఏజెంట్లకు ఆర్‌బీఐ కొత్త రూల్స్

అక్షరటుడే వెబ్‌డెస్క్:RBI Recovery Rules|బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకున్న...

Land Pattas | అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Pattas | ధరణి కష్టాలు తొలగించి,...

FBI Scam Network | అమెరికా వృద్ధులకు భారత్ స్కామర్ల టోకరా.. గుట్టురట్టు చేసిన FBI

అక్షరటుడే వెబ్‌డెస్క్: FBI Scam Network | అమెరికాలోని వృద్ధులను టార్గెట్...

Armoor Municipal Meeting | సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్​ పార్టీ కౌన్సిలర్ల డుమ్మా.. ప్రత్యేక భేటీపై సర్వత్రా చర్చ!

అక్షరటుడే,ఆర్మూర్: Armoor Municipal Meeting | ఆర్మూర్ మున్సిపల్ ఛైర్​పర్సన్ గోనె...