తెలంగాణWhite Collar Jobs | ఏఐతో వైట్​ కాలర్​ ఉద్యోగాలకు ముప్పు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక...

White Collar Jobs | ఏఐతో వైట్​ కాలర్​ ఉద్యోగాలకు ముప్పు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉందని సీఎం రేవంత్​రెడ్డి అభిప్రాయపడ్డారు. యువత బ్లూకాలర్​ ఉద్యోగాల వైపు దృష్టి పెట్టాలని సూచించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : White Collar Jobs | ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత తమ దృక్పథాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయ పడ్డారు. అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ జాబ్​లను ఏఐ రిప్లేస్ చేయలేదన్నారు.

White Collar Jobs | ఏటీసీలతో కొత్త కోర్సులు

చైనా, జపాన్ (Japan), కొరియాకు మనం ప్రత్యామ్నాయం కావాలని సీఎం పేర్కొన్నారు. త్వరలో గల్ఫ్‌ కార్మికుల కోసం మంచి పాలసీ తీసుకు వస్తామని చెప్పారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఏటీసీ (ATC) కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. టాటా సంస్థతో కలిసి ATCలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించామని తెలిపారు.

White Collar Jobs | ఆ దేశాల్లో డిమాండ్​

ఏదైనా చదువుకుంటే ఉద్యోగం రావాలి లేదా ఉపాధి అవకాశమైనా ఉండాలని సీఎం అన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. జీవన ప్రమాణాలు కూడా అమెరికా కన్నా మెరుగ్గా ఉన్నాయని వెల్లడించారు. ఇంగ్లీష్​ రాకున్నా కొన్ని దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయని తెలిపారు. అక్కడి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే జర్మన్, జపనీస్ భాషలు నేర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని సీఎం చెప్పారు.

White Collar Jobs | అమెరికా కొట్టుకుపోయే పరిస్థితి

25 ఏళ్ల క్రితం ఐటీ, కంప్యూటర్ కోర్సులు చేసి, అమెరికా (America) వెళ్లొచ్చనే భావన ఉండేదని రేవంత్​రెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో పెను మార్పులొచ్చాయని తెలిపారు. ఏఐ తుపానులో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులను అనుగుణంగా యువత దృక్పథం కూడా మారాలన్నారు.

దీనిని కూడా చదవండి: Land Pattas | అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Solar Energy Storage | సోలార్ ఎనర్జీ నిల్వ.. సింగరేణికి సిరులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Solar Energy Storage | సోలార్​ విద్యుత్​ను...

New Cars Burnt | కంటైనర్‌లో మంటలు.. 10 కొత్త కార్లు దగ్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : New Cars Burnt | కొత్త కార్లను...

TNGOs District Secretary | టీఎన్జీవోస్ జిల్లా సెక్రెటరీగా కుంట శ్రీనివాస్

అక్షరటుడే, భీమ్‌గల్: TNGOs District Secretary | టీఎన్జీవోస్(Nizamabad TNGOs) జిల్లా...

Kamareddy Fast Track Court | బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fast Track Court | పెళ్లి చేసుకుంటానని...