తెలంగాణPaddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం.. కేటీఆర్​ ఆగ్రహం

Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం.. కేటీఆర్​ ఆగ్రహం

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ విమర్శించారు. తెలంగాణ భవన్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వడ్లు కొనక 45 రోజుల్లో 10 మంది చనిపోతే ఒక్కరు కూడా చనిపోలేదని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్​ విమర్శింంచారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు 35 శాతం కూడా దాటలేదన్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 డిగ్రీల ఎండలు కొడుతున్నా.. రైతులు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Paddy Procurement | రైతుల కష్టాలు పట్టని సీఎం

ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని కేటీఆర్​ (KTR) అన్నారు. ముఖ్యమంత్రి 80శాతం కొనుగోళ్లు చేశామని చెబుతున్నారని, మంత్రి ఏమో 50 కొన్నట్లు చెప్పారన్నారు. కానీ క్షేత్రస్థాయిలో 35 శాతం దాటలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. సీఎం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు భరోసా వేయరని, యూరియా ఇవ్వరన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను సైతం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. దీంతో అన్నదాతలు తక్కువ ధరకు పంటను దళారులకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Paddy Procurement | మంత్రివర్గంలో చర్చించాలి

ప్రస్తుతం క్వింటాల్​కు 6 నుంచి 8 కిలోల తరుగు తీస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు. దీనిపై ఏ సెంటర్​కు అయినా వస్తామని, 80 శాతం కొనుగోళ్లు జరిగినట్లు నిరూపిస్తే.. తాము దేనికైనా సిద్ధమన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక నాలుగోసారి రైతు భరోసా ఎగ్గొట్టారన్నారు. ప్రస్తుతం లారీలు లేవని, గన్నీ బ్యాగుల కొరత ఉందని, హమాలీలు లేరన్నారు. ఏ పంట ఎంత మేర కొనుగోలు చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించాలన్నారు. భూ దోపిడీ మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టాలని సూచించారు. కాంగ్రెస్​ నాయకులు, సీఎం అనుచరులు రూ.వేల కోట్ల విలువైన భూములను కాజేస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు.

Paddy Procurement | వాళ్లు తోడు దొంగలు

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగలని కేటీఆర్​ విమర్శించారు. బండి భగీరథ్​పై పోక్సో కేసు నమోదు అయితే ఇద్దరు కలిసి అతడిని కాపాడే యత్నం చేశారన్నారు. 9 రోజుల పాటు నిందితుడిని దాచిపెడితే సామాన్య ప్రజలు అయితే ఇలాగే పోలీసులు ఊరుకుంటారా అని కేటీఆర్​ ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డికి హైట్​తో పాటు మెదడు కూడా తక్కువేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘9 రోజులు పోక్సో కేసులో నిందితుడిని కాపాడిన వెదవ ఎవర’ని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Heat Wave | మండుతున్న ఎండలు.. వడదెబ్బతో 22 మంది మృతి

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...

SBI Employees Candle Rally | ఎస్​బీఐ ఉద్యోగుల క్యాండిల్​ ర్యాలీ..

​అక్షరటుడే, ఇందూరు: SBI Employees Candle Rally | స్టేట్ బ్యాంక్​...