Profitable Crops Awareness | రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పించాలి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Profitable Crops Awareness | రైతులు లాభసాటి పంటలు పండించేలా అధికారులు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam Srinivas Reddy) అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని (Kamareddy) సత్య కన్వెన్షన్ హాల్​లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Profitable Crops Awareness | అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లు..

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివని పోచారం అన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది మొత్తం తినేది 40 లక్షల టన్నులు అయితే రాష్ట్రంలో అంతకంటే ఎక్కువ వరిధాన్యం (Paddy) పండుతుందన్నారు. వాటిని నిల్వ చేయడానికి గోదాములు సరిపోవడం లేదన్నారు. అందుకే అధికారులు పంట మార్పిడి కోసం రైతులను ప్రోత్సహించాలని, రైతు వేదికలలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Profitable Crops Awareness | పురోగతిలో ఇందిరమ్మ ఇళ్లు..

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. అయితే అనర్హులకు ఇళ్ల మంజూరు చేస్తున్నారని అక్కడక్కడా ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మంజూరు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali), జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు (MLA Thota Lakshmikanth Rao), జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇన్​ఛార్జి అడిషనల్ కలెక్టర్ గిరి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *