Nizamabad HM Suspension | ఇన్​ఛార్జి హెచ్​ఎం సస్పెన్షన్.. మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం ఎఫెక్ట్​.. ​

పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం వహించిన ఇన్​ఛార్జి హెచ్​ఎంపై వేటు పడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి : Nizamabad HM Suspension | పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం వహించిన ఇన్​ఛార్జి హెచ్​ఎంపై వేటు పడింది. డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జడ్పీహెచ్​ఎస్​ పాఠశాల ఇన్​ఛార్జి హెచ్​ఎం అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఉత్తర్వులు జారీ చేశారు.

Nizamabad HM Suspension | మిడ్​డే మిల్స్​పై నిర్లక్ష్యం..

2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో కలెక్టర్..ఈ ఉదంతంపై విచారణ జరిపించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఇన్​ఛార్జి హెచ్ఎం అమర్ సింగ్​ను సస్పెన్షన్​ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Dharmapuri Arvind | గడ్డం పెంచితే సీఎం అవుతారా?  కేటీఆర్‌పై ధర్మపురి అర్వింద్ సెటైర్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *