Police Firing Practice | పోలీసులకు ఫైరింగ్​ వెపన్స్​పై పూర్తి అవగాహన ఉండాలి..: సీపీ సాయి చైతన్య

పోలీసులకు ఫైరింగ్​ వెపన్స్​పై పూర్తి అవగాహన ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ : Police Firing Practice | పోలీసులకు ఫైరింగ్​ వెపన్స్​పై పూర్తి అవగాహన ఉండాలని సీపీ సాయిచైతన్య (CM Sai Chaitanya) పేర్కొన్నారు. జానకంపేట్​ ఫైరింగ్ కేంద్రంలో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్​ను ఆయన గురువారం పరిశీలించారు.

Police Firing Practice | సురక్షితంగా సమర్థవంతంగా వినియోగించాలి..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులు (Police Training) ఆయుధాలను సురక్షితంగా, సమర్థవంతంగా వినియోగించే విధంగా ప్రాక్టికల్ శిక్షణ పొందాలని సూచించారు. సిబ్బంది నిర్ణీత లక్ష్యాలపై ఫైరింగ్ నిర్వహిస్తూ లక్ష్యసాధన, ఖచ్చితత్వం, ఏకాగ్రత, ఆయుధాల వినియోగ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు, నేరస్తులపై చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి సందర్భాల్లో పోలీసులు తక్షణమే స్పందించాల్సి ఉంటుందని, అందుకు నిరంతర ఫైరింగ్ ప్రాక్టీస్ ఎంతో అవసరమన్నారు. అదేవిధంగా ఆయుధాలను వినియోగించే సమయంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, టాస్క్ ఫోర్స్, సీటీసీ, ట్రాఫిక్, ఏఆర్, హోంగార్డ్స్, ఐటీ ఏసీపీలు, సీఐలు, ఎస్​హెచ్​వోలు, పీఎస్​వోలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Varalakshmi Vratam 2026 | రేపే వరలక్ష్మీ వ్రతం.. పూజ విధానం , విశిష్టత ఇదే!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *