అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ST Special Commission | ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఛైర్మన్‌గా లంబాడా సోదరుడిని నియమిస్తామని చెప్పారు.
నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగులో సీఎం రేవంత్‌రెడ్డి సేవాలాల్ హహరాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసగించారు. అనంతపురంలో జన్మించిన సేవాలాల్ మహారాజ్.. లంబాడ యువతకు సన్మార్గాన్ని చూపారన్నారు. మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. లంబాడాలందరికీ సేవాలాల్ మహరాజ్ ఆరాధ్య దైవం అన్నారు.
ST Special Commission | ఇందిరాగాంధీ హయాంలో రిజర్వేషన్లు
బలహీన వర్గాల్లో ఉన్న లంబాడాల ఆర్థిక వెనుకబాటుతనాన్ని చూసి జైపాల్ రెడ్డి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి తీసుకెళ్లి 1976లో వారిని షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో చేర్చారని సీఎం గుర్తు చేశారు. రిజర్వేషన్ల కారణంగా లంబాడాలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించారన్నారు. దున్నేవాడికే భూములు ఇవ్వాలన్న ఉద్దేశంతో 12 లక్షల ఎకరాలను ఇందిరాగాంధీ లంబాడా సోదరులకు పంపిణీ చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే అందులో 4 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీలకే దక్కాయన్నారు. ప్రస్తుతం ఉన్న 16 ఎకరాలకు మరో నాలుగు ఎకరాలు సేకరించి మొత్తం 20 ఎకరాల్లో దేశానికే తలమానికమైన సేవాలాల్ మహారాజ్ దేవాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.
దీనిని కూడా చదవండి : Dhoolpet Ganja Raids | గంజాయి దందాపై ఉక్కుపాదం