Tata Nexon Sunroof | బడ్జెట్ ధరలో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్.. దేశంలోనే తొలిసారి పరిచయం చేస్తున్న టాటా మోటార్స్

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tata Nexon Sunroof |దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ టాటామోటార్స్ (Tata Motors) తన పాపులర్ ఎస్‌యూవీ కారు అయిన నెక్సాన్ లో కొత్త వేరియంట్​ను(Nexon new variant) తీసుకువచ్చింది. నెక్సాన్ భారతీయ మార్కెట్‌లో పది లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ప్యూర్ ప్లస్ పీఎస్ పేరుతో దీనిని పరిచయం చేసింది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

సాధారణంగా పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఖరీదైన కార్లలో లేదా టాప్ ఎండ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. కానీ టాటా మోటార్స్ మొదటిసారిగా రూ. 10 లక్షలలోపు ధరలోనే ఈ ఫీచర్‌ను తీసుకురావడం గమనార్హం. దీని ప్రారంభ ధర (ఎక్స్ షోరూం) రూ.9.59 లక్షలుగా నిర్ణయించింది. దేశంలో రూ. 10 లక్షలలోపు ధరలో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ అందిస్తున్న తొలి కారు ఇదే..

Tata Nexon Sunroof | ప్యూర్​ప్లస్ పీఎస్ వేరియంట్ ధరలు..

ఈ కొత్త టాటా నెక్సాన్ ప్యూర్ ప్లస్ పీఎస్ వేరియంట్ ఐదు పవర్ ట్రెయిన్ ఎంపికలలో లభిస్తుంది.

1.2 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ధర(ఎక్స్ షోరూం) రూ. 9.59 లక్షలు.

1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఏఎంటీ ధర(ఎక్స్ షోరూం) రూ. 10.14 లక్షలు.

1.2 లీటర్ టర్బో పెట్రోల్, ట్విన్ సిలిండర్, ఐసీఎన్జీ మాన్యువల్ ధర(ఎక్స్ షోరూం) రూ. 10.39 లక్షలు.

1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ ధర(ఎక్స్ షోరూం) రూ. 10.54 లక్షలు.

1.5 లీటర్ డీజిల్ ఏఎంటీ ధర(ఎక్స్ షోరూం) రూ. 11.19 లక్షలు.

Tata Nexon Sunroof | ఫీచర్లు..

ప్యూర్ ప్లస్ పీఎస్ మోడల్ వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లే సదుపాయంతో కూడిన 26.03 సీఎం హర్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు స్పీకర్ల ఆడియో సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో వస్తోంది. రెయిన్ సెన్సింగ్ ఫ్రంట్ అండ్ రియర్ వైపర్లు, పార్కింగ్ గైడ్‌లైన్స్‌తో కూడిన హెచ్ డీ రియర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఆటో ఫోల్డ్ ఫంక్షన్ తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం వంటి ఫీచర్లున్నాయి.

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *