అక్షరటుడే, వెబ్డెస్క్: POLYCET Results | తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ కాలేజీ (Polytechnic College)ల్లో ప్రవేశాల కోసం మే 13న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
27 నుంచి కౌన్సెలింగ్
టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన పాలిసెట్ ఫలితాలను శనివారం ఉదయం విడుదల చేశారు. ఈ పరీక్షకు 98,029 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేది వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రెండు విడతల్లో కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మే 27 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 82.84 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఇది కూడా చదవండి..: TGPOLYCET Results 2026 | రేపు పాలిసెట్ ఫలితాల విడుదల


