తెలంగాణKTR Congress Comments | ప్రజలు కాంగ్రెస్​ను బంగాళాఖాతంలో పడేస్తారు : కేటీఆర్​

KTR Congress Comments | ప్రజలు కాంగ్రెస్​ను బంగాళాఖాతంలో పడేస్తారు : కేటీఆర్​

రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువచ్చేందుకు, వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని కేటీఆర్​ ఆరోపించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Congress Comments | ఎన్నికల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కాంగ్రెస్​ను బంగాళాఖాతంలో పడేస్తారని పేర్కొన్నారు.

అంబర్‌పేట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. పార్లమెంట్‌లో BRS లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణఏర్పాటును అవమానించేలా BJP ఎంపీ మాట్లాడితే.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని విమర్శించారు.

KTR Congress Comments | నగరంలో సౌకర్యాలు లేవు

రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటున్నారని, ఉన్న నగరంలో సౌకర్యాలు కల్పించే దిక్కులేదని కేటీఆర్​ విమర్శించారు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాడా అని ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తానని రేవంత్ చెబుతున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన మొదలైందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఎస్‌టీపీలు ఏర్పాటు చేశామని చెప్పారు.

KTR Congress Comments | వారికే టికెట్లు

GHMC ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని కేటీఆర్​ స్పష్టం చేశారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామన్నారు. నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాకుండా.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌లకు, మోటార్లకు మీటర్లు పెడతారు అంట అని కేటీఆర్​ అన్నారు. ఆనాడు మోదీ ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదన్నారు.

KTR Congress Comments | పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో..

మన పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ అన్నారు. మధ్యలో అప్పుడప్పుడు వచ్చిపోతేనే అందరికి భయం అవుతుందని ఎద్దేవా చేశారు. మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక మేము ఉన్నామని భరోసా ఇచ్చారు.

 

దీనిని కూడా చదవండి : Ponguleti Paper Controversy | మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన పొంగులేటి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

BJP Chief Letter | సీఎం రేవంత్‌కు బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Chief Letter | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి...

Iran Peace Agreement | కొద్ది గంటల్లో గుడ్​న్యూస్​.. యూఎస్​ విదేశాంగ కార్యదర్శి కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Peace Agreement | నాలుగు రోజుల...

Nandipet Infant Abandonment | నందిపేట్​లో దారుణం.. పసికందును వదిలేసి వెళ్లిన వ్యక్తులు..

అక్షరటుడే, ఆర్మూర్: Nandipet Infant Abandonment | నందిపేట్​లో (nandipet) అమానుష...

Hyderabad Car Stunts | కార్లతో స్టంట్లు.. షాక్​ ఇచ్చిన పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Car Stunts | హైదరాబాద్​ (Hyderabad)...