అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cheeta Force Nizamabad | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి (Cheeta Force Raid) చేసింది. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్ ఇన్‌ఛార్జి ఏసీపీ మస్తాన్అలీ ఆదివారం వివరాలు వెల్లడించారు.
Cheeta Force Nizamabad | నాల్గో టౌన్ పరిధిలో..
సీసీఎస్ ఇన్‌ఛార్జి ఏసీపీ (CCS Police Action) తెలిపిన వివరాల ప్రకారం.. నాల్గో టౌన్ పరిధిలో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు వినాయక్‌నగర్‌లోని (Vinayak Nagar) ఓ ఇంటిపై చీతాఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. దాడిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రూ.4,870 నగదు, ఏడు ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం వారిని నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించినట్లు సీసీఎస్ ఇన్‌ఛార్జి ఏసీపీ మస్తాన్ అలీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Paddy Procurement Review | నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం


