హైదరాబాద్Hydraa Demolitions | కోకాపేటలో హైడ్రా కూల్చివేతలు

Hydraa Demolitions | కోకాపేటలో హైడ్రా కూల్చివేతలు

కోకాపేటోని కొత్త చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Demolitions | హైదరాబాద్​ (Hyderabad)లో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా చర్యలు చేపడుతోంది. గండిపేట మండలం కోకాపేటోని కొత్త చెరువులో ఆక్రమణలను మంగళవారం తొలగించింది.

నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా స్థలాల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తోంది. కోకాపేటలోని కొత్తచెరువు వద్ద మంగళవారం తెల్లవారుజామున హైడ్రా అధికారులు (Hydraa Officers) భారీ ఆపరేషన్​ చేపట్టారు. చెరువు ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్ పరిమితుల్లో అక్రమంగా నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ కంపౌండ్ గోడలు, తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు.

Hydraa Demolitions | భారీ బందోబస్తు మధ్య..

కోకాపేట ప్రాంతంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటాయి. దీంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ మేరకు కొత్త చెరువులో నిర్మాణాలు ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. భారీ బందోబస్తు మధ్య వాటిని తొలగించారు. అనంతరం చెరువు చుట్టూ ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని జలవనరులను కాపాడేందుకు, చెరువుల ఆక్రమణదారుల ఆట కట్టించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Stock Market india | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market india | దేశీయ స్టాక్ మార్కెట్...

హైదరాబాద్‌ టెక్‌ అద్భుతం.. గాల్లోకి లేవనున్న భారీ కార్గో విమానం ‘జెన్ #2’

హైదరాబాద్‌కు చెందిన డీప్‌-టెక్ ఏరోస్పేస్ స్టార్టప్ 'బ్లూజే ఏరోస్పేస్' (BluJ Aerospace)...

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాలు షురూ

ప్రముఖ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తన సిబ్బంది కోసం సరికొత్త...

Armoor Officials Transfer | ఆర్మూర్ బల్దియాలో ముగ్గురు అధికారుల బదిలీ..

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Officials Transfer | ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో...