తెలంగాణKCR Jagtial Meeting | నువ్వు వెయ్యి జన్మలు ఎత్తిన చావను.. కేసీఆర్​ కీలక వ్యాఖ్యలు

KCR Jagtial Meeting | నువ్వు వెయ్యి జన్మలు ఎత్తిన చావను.. కేసీఆర్​ కీలక వ్యాఖ్యలు

జగిత్యాల సభలో మాజీ సీఎం కేసీఆర్​ కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హామీలు అమలు చేయడం చేతకావడం లేదన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR Jagtial Meeting | జగిత్యాల సభలో మాజీ సీఎం కేసీఆర్ (KCR)​ కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి జీవన్​రెడ్డి (Jeevan Reddy) కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ బాస్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డిపై విరుచుకుపడ్డారు.

రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అడ్డం పొడువు మాట్లాడుతారన్నారు. కానీ ప్రజలకు నీరు ఇవ్వడం లేదని విమర్శించారు. పొద్దున లేస్తే కేసీఆర్​ చావాలని అంటారన్నారని పేర్కొన్నారు. ‘నువ్వు వెయ్యి జన్మలు ఎత్తిన నేను చావ కొడక’ అన్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగొద్దని.. ఈ వెదవల శాపానికి కేసీఆర్​ చస్తాడా అన్నారు. కాంగ్రెస్​ పాలనలో మళ్లీ కరెంట్​ కష్టాలు మొదలయ్యాని విమర్శించారు. కరెంట్​ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

KCR Jagtial Meeting | భూముల ధరలు పడిపోయాయి

బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో భూముల ధరల భారీగా ఉండేవని కేసీఆర్​ గుర్తు చేశారు. ఇప్పుడు భూములు కొనేవారు కరువయ్యారన్నారు. ధరలు పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బోనస్​ పేరిట బోగస్​ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్​ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్​ పోవాలి, బీఆర్​ఎస్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

KCR Jagtial Meeting | 40 ఏళ్లుగా స్నేహితులం

జీవన్​రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని కేసీఆర్​ అన్నారు. ఆయన తన సైన్యాన్ని తీసుకొని తెలంగాణ భవిష్యత్ ప్రయోజనాల కోసం బీఆర్​ఎస్​లో చేరారని చెప్పారు. ఆయన వెంట వచ్చిన వారికి కేసీఆర్​ స్వాగతం తెలిపారు. జీవన్​రెడ్డి తాను 40 ఏళ్లుగా స్నేహితులమన్నారు. ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా జీవన్​రెడ్డి అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన తన ప్రాంత అభివృద్ధిని ఏనాడు విస్మరించలేదన్నారు. జీవన్​రెడ్డి చేరికతో చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందన్నారు.

kcr

KCR Jagtial Meeting | పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం

తాను జీవన్​రెడ్డి కుటుంబంలో అన్నాదమ్ముళ్ల తాము పని చేస్తామని మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. ఆయన చేరికతో బీఆర్​ఎస్​కు బలం వచ్చిందన్నారు. జీవన్​రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్​, ఆదిలాబాద్, నిజామాబాద్​ జిల్లాల బాధ్యతలు కూడా ఆయన చూడాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం బీఆర్​ఎస్​ ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జీవన్​రెడ్డికి మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

KCR Jagtial Meeting | రైతుబంధు​కు ఎగనామం

తాము తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశామని కేసీఆర్​ చెప్పారు. ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఆ సమయంలో ప్రజలు తనకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. తమ హయాంలో మిషన్​ కాకతీయ పేరిట చెరువులను పునరుద్ధరించామన్నారు. మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని తెలిపారు. కాంగ్రెస్​ పాలనలో నీళ్లు రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్​ నాయకులు రైతు బంధు (Rythu Bhandu)కు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్​ చెప్పారన్నారు. తమ హయాంలో 10 రోజుల వ్యవధిలో అందరు రైతులకు రైతు బంధు వేశామన్నారు. కానీ కాంగ్రెస్​ నాయకులు నెలకు ఒక ఒకరకు మాత్రమే వేస్తున్నారని విమర్శించారు.

kcr sabha

యూరియా ఇవ్వలేని ప్రభుత్వం

ఈ ప్రభుత్వానికి యూరియా (Urea) బస్తాలు ఇవ్వడం చేతకావడం లేదని కేసీఆర్​ విమర్శించారు. దుకాణాల్లో లేని బస్తాలు యాప్​ల్లో ఎక్కడ ఉంటాయని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు అనేక గోసలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతగాని తనానికి ఇది నిదర్శనమన్నారు.

హైడ్రాను రద్దు చేస్తాం

హైదరాబాద్​లో పనికిమాలిన హైడ్రా (Hydraa)ను తెచ్చి పేదల ఇళ్లు కూల్చుస్తున్నారని కేసీఆర్​ మండిపడ్డారు. తమ హయాంలో 3.50 లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చమన్నారు. బీఆర్​ఎస్​ రాగానే హైడ్రాను ఎత్తి బయట పడేస్తామన్నారు. మొదటి సంతకంతో హైడ్రాను రద్దు చేస్తామని ప్రకటించారు. తాము ఎన్నో చెరువులు బాగు చేశామని.. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్​ నిలదీస్తామన్నారు.

దీనిని కూడా చదవండి : Harish Rao Delhi Visit | హరీశ్​రావు అందుకే ఢిల్లీ వెళ్లారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....