తెలంగాణBandi Bhagirath Custody | బండి భగీరథ్​ పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి

Bandi Bhagirath Custody | బండి భగీరథ్​ పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి

బండి భగీరథ్​పై నమోదు అయిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనను పోలీస్​ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Custody | బండి భగీరథ్​పై నమోదు అయిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనను పోలీస్​ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భగీరథ్​పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్​లోని పేట్​బషీరాబాద్​ (Pet Basherbad) పోలీస్​ స్టేషన్​లో మే 8న ఆయనపై కేసు నమోదు అయింది. అయితే 9 రోజుల పాటు నిందితుడు పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా.. అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తన న్యాయవాదులతో కలిసి భగీరథ్​ మే 16న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్​ విధించారు.

Bandi Bhagirath Custody | మూడు రోజుల కస్టడీకి..

బండి భగీరథ్​ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ కేసు విచారణకు ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసులో కీలక వివరాలు సేకరించడానికి నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మల్కాజ్​గిరి కోర్టు (Malkajgiri Court)లో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై నాలుగు రోజుల క్రితం వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను నేటికి వాయిదా వేశారు. నేడు విచారణ అనంతరం భగీరథ్​ను మూడు రోజుల పాటు పోలీస్​ కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

court 2

దీనిని కూడా చదవండి : RTC Driver Removal | వడ్లు కొనమన్నందుకు.. ఆర్టీసీ డ్రైవర్​ను విధుల్లో నుంచి తీసేశారు!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Raid | నాలా కన్వర్షన్​ కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా...

భారత్‌లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టుమారో మేకర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గోద్రేజ్ ఫౌండేషన్

వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించేందుకు గోద్రేజ్ ఫౌండేషన్ సరికొత్త జాతీయ...

Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు...

Aaya Share Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని ‘ఆయా షేర్’ సాంగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aaya Share Song | నేచురల్ స్టార్...