Vijaya Reddy Funeral | మాజీ మంత్రి సతీమణి పార్థీవదేహానికి పీసీసీ చీఫ్​ నివాళి

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు/ఆర్మూర్​: Vijaya Reddy Funeral | మాజీ మంత్రి శనిగరం సంతోష్​రెడ్డి సతీమణి విజయరెడ్డి రెండురోజుల క్రితం హైదరాబాద్​లో (Hyderabad) మృతి చెందారు. బుధవారం జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

Vijaya Reddy Funeral | నివాళులర్పించిన పీసీసీ చీఫ్​..

ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్ (Mahesh Kumar Goud)​ బుధవారం మహాప్రస్థానానికి వెళ్లారు. మాజీ మంత్రి సంతోష్​రెడ్డిని (Former Minister Santosh Reddy) పరామర్శించారు. అనంతరం ఆయన సతీమణి విజయరెడ్డి పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్​ లిమిటెడ్​ మానాల మోహన్​రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​, డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ అన్వేష్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

pcc 1

ఇది కూడా చదవండి: Panipuri Food Poisoning | పానీపూరి తిని 25 మందికి తీవ్ర అస్వస్థత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *