అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ande Sri Smruti Vanam | తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ స్మృతివనంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన అందెశ్రీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందెశ్రీకి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గేయంగా ప్రకటించారు. అయితే గతేడాది నవంబర్‌లో ఆయన కన్నుమూశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అందె శ్రీ మరణం తర్వాత ఆయన పేరిట స్మృతి వనం నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మరణించి ఆరు నెలలు అవుతున్న దాని గురించి పట్టించుకోలేదు. కనీసం అందెశ్రీని ఖననం చేసిన చోట ఇంత వరకు సమాధి కూడా కట్టలేదు.
Ande Sri Smruti Vanam | ఓట్ల కోసం..

జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections) త్వరలో జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం సెటిలర్ల ఓట్లపై కన్నేసింది. ఈ క్రమంలో ఇటీవల సీఎం మైత్రివనం జంక్షన్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్ర నుంచి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అందులో కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారి ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికే ఎన్టీఆర్ విగ్రహం పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు అందెశ్రీ స్మృతి వనం గురించి పట్టించుకోకుండా.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
Ande Sri Smruti Vanam | ఎలాగైనా గెలవాలని..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ మేరకు గతంలో నెల రోజుల పాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టింది. ప్రస్తుతం జోనల్ మున్సిపల్ కమిషనర్లు నిత్యం వీధుల్లో తిరుగుతున్నారు. జలమండలి అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఓల్డ్ సిటీ పరిధిలో మజ్లిస్ హవా కొనసాగే అవకాశం ఉంది. నగరంలో బీజేపీకి కూడా మంచి పట్టు ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెటిలర్లు బీఆర్ఎస్ వైపు నిలిచారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సెటిలర్లను ఆకట్టుకోవడానికి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసినట్లు పలువురు విమర్శిస్తున్నారు.
అందెశ్రీ సమాధి దగ్గర పరిస్థితి.. ఇవాళ ఉదయం..
పక్క రాష్ట్రపొళ్ళ విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ..
తెలంగాణ ఉద్యమకారుడు,
రేవంత్ రెడ్డి సీఎం అవడానికి చాలా కష్టపడ్డ అందెశ్రీ “స్మృతి వనం” మీద లేకపాయే..కనీసం సమాధి కూడా సరిగా కట్టకపోతిరి..
ఇప్పుడు మాట్లాడండిరా..! pic.twitter.com/JUiC5jYfKh
— Prabhakar Venavanka (@Prabhavenavanka) May 30, 2026
ఇది కూడా చదవండి..: Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేస్తారా!


