RTC bus accident | పండ్లు కొనేందుకు వెళ్లిన వ్యక్తిని కబలించిన ఆర్టీసీ బస్సు

Shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: RTC bus accident | పండ్లు కొనేందుకు రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి ఆర్టీసీ బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి (Yellareddy) మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.

RTC bus accident | ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఏమిలి అరుణ్ (45) పండ్లు కొనుగోలు చేయడానికి ఎల్లారెడ్డి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి పట్టణానికి వస్తున్న బస్సు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు (Yellareddy Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్​

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *