అక్షరటుడే, వెబ్‌డెస్క్: State Finance Commission | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రెండో రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులను నియమించింది. ఈ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా సూర్యాపేట జిల్లాకు చెందిన సంకేపల్లి సుధీర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎండీ అసిఫ్ అలీ, వికారాబాద్ జిల్లాకు చెందిన రంగరాజ్ నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. విధులు రాష్ట్ర ఆర్థిక సంఘం స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతం కావడానికి సూచనలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, ఫీజులను ఎలా పంపిణీ చేయాలని చెబుతుంది. స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం అందించే నిధులపై సూచనలు చేస్తుంది.
State Finance Commission | మరో సారి సభ్యుడిగా అవకాశం
కాగా గతంలో సైతం సిరిసిల్ల రాజయ్యను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవి కాలం 2026 ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో మరోసారి ఆయనను ఛైర్మన్‌గా నియమించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన సంకేపల్లి సుధీర్ రెడ్డికి సైతం మరో సారి సభ్యుడిగా అవకాశం కల్పించింది.
ఇది కూడా చదవండి..: KTR Padayatra | ‘కారు’ గేరు ఎప్పుడు మార్చాలో తెలుసు.. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా : కేటీఆర్
