Urea Purchase | ఉత్పత్తులు కొనాలని రైతులను ఒత్తిడి చేయవద్దు: కలెక్టర్

జిల్లాలోని రైతులు యూరియా , ఎరువులు కొనేందుకు వచ్చినప్పుడు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయవద్దని కలెక్టర్​ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Urea Purchase | జిల్లాలోని రైతులు యూరియా(urea), ఎరువులు కొనేందుకు వచ్చినప్పుడు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయవద్దని కలెక్టర్​ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

Urea Purchase | ఎరువులు దుకాణాలు.. వివిధ సంస్థలు..

జిల్లాలోని ఎరువుల దుకాణాలు, వివిధ సంస్థలు (fertilizer dealers) రైతులు ఒత్తిడి చేసినట్లు సమాచారం తెలిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కలెక్టర్ (collector warning)​ తెలిపారు. యూరియా ఎరువులు కొనుగోలు చేసేందుకు వచ్చే పలువురు రైతులకు (farmer welfare) నానో యూరియా కొనుగోలు చేయాలని కొంతమంది ఎరువుల దుకాణాదారులు, వివిధ సంస్థల వారు ఒత్తిడి చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందన్నారు. రైతులు కోరిన ఎరువులను మాత్రమే వారికి అందించాలని సూచించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తూ రైతులను ఎవరైనా ఒత్తిడి చేస్తే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

urea

ఇది కూడా చదవండి: Hyderabad rains | హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *