Gold Inspections | బంగారం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి..

జిల్లాలో బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వినియోగదారుల మండలి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు లీగల్​ మెట్రాలజీ ఇన్​స్పెక్టర్​ సందీప్​కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Gold Inspections | జిల్లాలోని బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వినియోగదారుల మండలి(Consumer Council) జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, జిల్లా వినియోగదారుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు లీగల్​ మెట్రాలజీ (Legal Metrology) ఇన్​స్పెక్టర్​ సందీప్​కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

Gold Inspections | కార్పొరేట్​ బంగారు ఆభరణాలు దుకాణాల్లో..

బంగారు ఆభరణాల నాణ్యతను తనిఖీ చేసేందుకు లీగల్ మెట్రాలజీ శాఖకు అన్ని అధికారాలు ఉన్నాయని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని కార్పొరేట్​ బంగారు నగల వ్యాపారస్తులు (Jewelry Shops) నాణ్యతకు సంబంధించిన హెచ్​యూఐడీ నెంబర్​ను రాయకుండా, నాణ్యతతో సంబంధించిన పూర్తి వివరాలు తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారన్నారు. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న క్రమంలో ఆ షాపులలో అమ్మకం జరుగుతున్న ఆభరణాల నాణ్యత ప్రమాణాలను లీగల్ మెట్రాలజి శాఖ తప్పనిసరిగా తనిఖీ నిర్వహించాలని వారు డిమాండ్​ చేశారు. లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 రూల్ నెంబర్ 9 (4) (5)ల ప్రకారం శాఖకు పూర్తి అధికారాలున్నా ఎందుకు తనిఖీ చేయట్లేదని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వీఎన్​ వర్మ, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేష్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Kavitha Education Demands | ఈ నెలలోనే ‘ఫీజుల నియంత్రణ చట్టం’ తీసుకురావాలి: కల్వకుంట్ల కవిత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *