అక్షరటుడే, వెబ్డెస్క్ : Steel Plant Compensation | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి విశాఖపట్నం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం పరామర్శించారు.
ప్రమాదం జరిగిన తీరుని పవన్ (Deputy CM Pawan Kalyan) తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు.
Steel Plant Compensation | త్రీమెన్ కమిటీ విచారణ

స్టీల్ ప్లాంట్లో 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని పవన్ అన్నారు. ఈ ఘటనపై త్రీమెన్ కమిటీ విచారణ చేస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని తమ ఆకాంక్ష అని చెప్పారు. త్వరలోనే ప్లాంట్ కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Visakha Steel Plant Accident | స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్
