అక్షరటుడే, వెబ్‌డెస్క్: Steel Plant Accident | విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్లాంట్ సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఉక్కుద్రవం తరలిస్తున్న లాడర్ పేలడంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పైడిరాజు అనే కార్మికుడు బుధవారం కన్ను మూశాడు. మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి పైడిరాజు ఓడిపోయాడు.
Steel Plant Accident | వైఎస్ జగన్ పరామర్శ
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత విశాఖపట్నం చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టు (Visakhapatnam Airport) వద్ద వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో బారీకేడ్లు పెట్టి వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి..: Steel Plant Compensation | స్టీల్‌ప్లాంట్ ఘటన.. పరిహారం ప్రకటించిన పవన్
