Missing Case | ముగ్గురు పిల్లలతో తల్లి అదృశ్యం.. విచారణ చేపడుతున్న పోలీసులు

షాపింగ్ కోసమని పిల్లలతో కలిసి బయలుదేరిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Missing Case | షాపింగ్ కోసమని పిల్లలతో కలిసి బయలుదేరిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy)పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

Missing Case | ఇంటికి రాకపోవడంతో..

పట్టణ సీఐ నరహరి (CI Narahari) తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన యాడారం శ్యామల తన ముగ్గురు పిల్లలు బిందు (17), శివ (13), దివిజ (8)తో కలిసి ఉదయం కామారెడ్డి పట్టణానికి షాపింగ్​కు వెళ్తున్నామని ఇంటినుంచి బయలు దేరింది. షాపింగ్ పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని తన తమ్ముడి ఇంటికి వెళ్లింది. అనంతరం ఇంటికి వెళ్తామని చెప్పి సాయంత్రం ఆటోలో బస్టాండుకు పిల్లలతో కలిసి బయలు దేరింది.  రాత్రి 8 గంటల బసుకు ఇంటికి వస్తున్నానని చెప్పినా.. ముగ్గురు ఇంటికి రాకపోవడంతో భర్త భానుప్రకాశ్ కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

ఇది కూడా చదవండి..: ATM Card Fraud | ఏటీఎం కార్డును మార్చేసి రైతును దోచేసిన అగంతకుడు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *