Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Crop Diversification | పంట మార్పిడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా : టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత

రైతు సమస్యలను పరిష్కరించాలని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు. నల్గొండలో నిర్వహించిన రౌండ్​ టేబుల్​ సమావేశంలో ఆమె మాట్లాడారు.

Srinivas Kolluri
Last updated: June 11, 2026, 8:11 pm 8:11 pm
Srinivas Kolluri
Share
Crop Diversification

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Crop Diversification | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను గాలికొదిలేసి, కేవలం కుర్చీలాటరీపైనే ధ్యాస పెట్టాయని టీఆర్​ఎస్ (TRS)​ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

కవిత గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. బత్తాయితోటను సందర్శించి, రైతులతో మాట్లాడారు. నల్గొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో హోటల్ మనోరమాలో తెలంగాణ రక్షణ సేన ఆధ్యర్యంలో రైతు సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు ఒక విధానం, ఉక్కు సంకల్పం ఉంటే ఎలాంటి సమస్యనైనా తీర్చవచ్చన్నారు.

Crop Diversification | మళ్లీ కొనలేని పరిస్థితి

వరి ఎక్కువ అవుతోందని ప్రభుత్వం చెబుతోందని కవిత అన్నారు. కానీ పంటమార్పిడిపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా అని ప్రశ్నించారు. ఉంటే ఇప్పటి వరకు రైతులతో ఎందుకు ఈ అంశంపై చర్చించలేదన్నారు. ఇలాగే ఉంటే మరో నాలుగు నెలల్లో మళ్లీ 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. అప్పుడు మళ్లీ కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యాసంగి సీజన్​లోనే ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. నివారించే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Crop Diversification | క్రాప్​ కాలనీలు ఏర్పడాలి

trs kavitha

రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాడాలని సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రైతు పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కవిత డిమాండ్​ చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు జగిత్యాల మామిడి పండ్లకు బ్రాండ్ క్రియేట్ చేశానని గుర్తు చేశారు. అలాగే నల్గొండలో బత్తాయి రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Crop Diversification | తరుగు పేరిట దోపిడీ

ఈ ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోళ్లలో క్వింటాకు 6 కిలోల చొప్పున తరగు తీస్తూ రైతులకు వెయ్యి కోట్లకు పైగా నష్టం చేసిందని కవిత విమర్శించారు. రవాణా, ప్యాకింగ్ ఖర్చులన్నీ రైతుల మీదే వేసి వారిపై మరో 2 వందల కోట్ల భారం మోపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 36 శాతం మంది కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. వాళ్లను గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రైతు డిస్కం ఏర్పాటు చేయొద్దన్నారు. యూరియ యాప్ తీసేయాలని, పడ్డ రైతు భరోసా తక్షణమే విడుదల చేయాలని తీర్మానం చేశారు.

మొత్తం వ్యవసాయ రైతుల్లో 37 శాతం ఉన్న కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాలి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి pic.twitter.com/3bp2QerpZe

— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 11, 2026

దీనిని కూడా చదవండి : Singareni Achievement | సింగరేణి అరుదైన ఘనత.. డోర్లీ–2 గనిలో అడవిని పెంచిన సంస్థ

TAGGED:agricultural policyCrop ColoniesCrop DiversificationFarmer Issuesfarmer welfareKavithaPaddy ProcurementTelangana agriculture
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad RTC | Nizamabad RTC | ఆర్టీసీ ఆర్​ఎంగా ఎస్పీజీకే మూర్తి బాధ్యతల స్వీకరణ
Next Article Nepal Gang Arrested Nepal Gang Arrested | గచ్చిబౌలి చోరీ కేసు.. నేపాల్​ గ్యాంగ్ అరెస్ట్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Bandi Sanjay Allegations
తెలంగాణ

Bandi Sanjay Allegations | ‘బాధితులను బండి సంజయ్ బెదిరించారు’.. ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ సంచలన ఆరోపణలు

By Naresh Chandan
Kadiyam Srihari Comments
తెలంగాణ

Kadiyam Srihari Comments | కేసీఆర్ వైఖరి నచ్చకే బయటకు వచ్చా.. కడియం సంచలన వ్యాఖ్యలు!

By Balla Sandeep Kumar
Telugu girl drowning
హైదరాబాద్అంతర్జాతీయంతెలంగాణ

Telugu girl drowning | స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తెలుగు యువతి మృతి.. అమెరికాలో ఘటన

By Naresh Chandan
Kavitha
తెలంగాణ

Kavitha | తెలంగాణ ‘అమ్మ’గా కవిత.. మరో జయలలిత పుట్టుకొస్తుందా?

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.