నిజామాబాద్Kavitha Sabha | కల్వకుంట్ల కవిత సభకు తరలిరావాలి..

Kavitha Sabha | కల్వకుంట్ల కవిత సభకు తరలిరావాలి..

అమరుల ఆశయ సాధన, సంపూర్ణ తెలంగాణ వికాసం అనే నినాదంతో ఈనెల 25న కొత్త రాజకీయ అధ్యాయానికి కల్వకుంట్ల కవిత నాంది పలకనున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

అక్షరటుడే, బాన్సువాడ: Kavitha Sabha | అమరుల ఆశయ సాధన, సంపూర్ణ తెలంగాణ వికాసం అనే నినాదంతో ఈనెల 25న కొత్త రాజకీయ అధ్యాయానికి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నాంది పలకనున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్​అండ్​బీ అతిథి గృహంలో మామిండ్ల రాజు, గుల సత్యం ఆధ్వర్యంలో సభకు వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు.

Kavitha Sabha | అమరుల ఆశయ సాధనకు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అమరుల ఆశయాల సాధన లక్ష్యంగా కొత్త పార్టీ ముందుకు వస్తోందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని పేర్కొన్నారు. సభను విజయవంతం చేసేందుకు బాన్సువాడ నియోజకవర్గం (Banswada Constituency) నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సుమారు 50 వాహనాల ద్వారా కార్యకర్తలు, అభిమానులను హైదరాబాద్‌కు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, ఇది కొత్త పార్టీ ఆవిష్కరణకు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పడుతుందని, ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Kavitha Sabha

ఇది కూడా చదవండి..: RTC Workers | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించ్సాలిందే..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....