అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Murder | హైదరాబాద్‌లోని గోల్కొండ (Golconda)లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. అత్తింటివారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమార్‌వాడిలో శుక్రవారం మధ్యాహ్నం చందీ మసూద్ అలియాస్ షేక్ మసూద్ (30) అనే వ్యక్తిని కొట్టి చంపారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మసూద్ చాంది శుక్రవారం ప్రార్థనల అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు వెంబడించడం గమనించాడు. దీంతో అతను హడావిడిగా ఇంట్లోకి వెళ్లాడు. అయితే సోహైల్ అనే వ్యక్తి తన ముగ్గురు బావమరుదులు, ఒక మహిళా బంధువుతో కలిసి బలవంతంగా ఇంట్లోకి చొరబడి, డంబెల్ రాడ్లతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మసూద్ అక్కడికక్కడే మరణించాడు.
Hyderabad Murder | కేసు నమోదు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
Brutal #murder in #Hyderabad’s #Golconda: 30-year-old man killed, in-laws suspected
A 30-year-old man, Chandi Masood alias Shaik Masood, was allegedly beaten to death at Kumarwadi under Golconda Police Station limits on Friday.
According to preliminary information, Masood had… pic.twitter.com/Pj3nRf6waz
— NewsMeter (@NewsMeter_In) June 12, 2026
దీనిని కూడా చదవండి : Nepal Gang Arrested | గచ్చిబౌలి చోరీ కేసు.. నేపాల్ గ్యాంగ్ అరెస్ట్
