అక్షరటుడే, వెబ్డెస్క్: Road Accidents Telangana | నల్గొండ జిల్లా (Nalgonda District) నందికొండ (నాగార్జున సాగర్) పరిధిలోని హిల్ కాలనీ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
హిల్ కాలనీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఒక కారు, ‘థార్’ (Thar) SUV వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నందికొండలోని కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accidents Telangana | బస్సు దగ్ధం
తిరుపతి జిల్లా శ్రీసిటీలో శనివారం ఉదయం ఐమాప్ కంపెనీ ఉద్యోగుల బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని డ్రైవర్ ముందే గమనించి బస్సును ఆపడంతో, ఉద్యోగులందరూ వేగంగా కిందకు దిగిపోయారు. వారు దిగిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో అందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Road Accidents Telangana | జనగామ జిల్లాలో..
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హన్మకొండకు చెందిన అసద్, హబీబ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుల్బార్గా నుంచి హన్మకొండకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Anger | సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం