KTR On SIR | ఎస్​ఐఆర్​పై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR On SIR | ఎస్​ఐఆర్​ జరిగిన ప్రాంతాల్లో బీజేపీ వాళ్లకు పడవన్న ఓట్లు అన్ని తొలగించారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. వేములవాడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు.

ఎస్​ఐఆర్​పై కేటీఆర్​ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) తెచ్చి వెస్ట్ బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తీసేశారన్నారు. 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ తమను తొలగించారని కోర్టులో కేసు వేశారని చెప్పారు. తమిళనాడు (Tamilnadu)లో మాజీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. దీంతో ఆయన 10 వేల ఓట్లతో ఓడిపోయారని చెప్పారు. తెలంగాణలో జూన్ 25 నుంచి SIRను తీసుకొస్తున్నారని, బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

KTR On SIR | పదవులు అమ్ముకుంటున్నారు

కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారు అని షబ్బీర్ అలీ చెప్పింది నిజమని కేటీఆర్​ అన్నారు. రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. నెల నెల రెన్యువల్ కావాలంటే.. పైసలు కట్టాల్సిందే అన్నారు. సీఎం పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి.. రాహుల్ గాంధీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.

KTR On SIR | కూల్చివేతలు వద్దన్నందుకు..

KTR On SIR

మీనాక్షి నటరాజన్ ఒక సిన్సియర్ పొలిటీషియన్ అని కేటీఆర్​ అన్నారు. హైడ్రా, మూసీ పేరిట నాశనం చేస్తున్నావ్.. గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టొద్దని ఆమె చెప్పిందట అని పేర్కొన్నారు. దీంతో ఆమెపై పగబట్టి.. బీజేపీకి లీకులు ఇచ్చి.. మీనాక్షి రాజ్యసభ నామినేషన్‌ని రిజెక్ట్ అయ్యేలా సీఎం చేశారని ఆరోపించారు. ప్రపంచంలో ఎవరైనా రావణాసురుడు నాకు స్ఫూర్తి అని చెప్తారా అని కేటీఆర్​ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాత్రం తనకు రావణాసురుడు, హిట్లర్, నరకాసురుడు స్ఫూర్తి అని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి నుంచి మనం ఏం ఆశించగలమన్నారు.

ఇది కూడా చదవండి..: Road Accidents Telangana | నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *