అక్షరటుడే వెబ్‌డెస్క్: Nandipadu Child Assault | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఒక కామాంధుడు లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Nandipadu Child Assault | ఘటన వివరాలు..
వేసవి సెలవులు కావడంతో బాలిక తన బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో కూల్ డ్రింక్ కొనుక్కునేందుకు గ్రామంలోని ఒక షాపునకు ఒంటరిగా వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన లక్ష్మణ్‌రావు (55) అనే వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Nandipadu Child Assault |చితకబాదిన బంధువులు..
విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు లక్ష్మణ్‌రావును పట్టుకుని దేహశుద్ధి చేశారు. బంధువుల దాడి నుండి తప్పించుకునేందుకు నిందితుడు అక్కడి నుంచి పారిపోయి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Nandipadu Child Assault | కేసు నమోదు..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని నందిపాడు గ్రామంలో ఘటన
వేసవి సెలవుల కావడంతో.. బంధువుల ఇంటికి వచ్చిన బాలిక
కూల్ డ్రింక్ కొనేందుకు షాపుకు ఒంటరిగా వెళ్లగా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ లక్ష్మణ్‌రావు (55)
ఈ విషయం… pic.twitter.com/HftA7gcc3P
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 14, 2026
ఇది కూడా చదవండి: Indian Sailors Death | భారత నావికుల ప్రాణాలు పోతే.. కేంద్రం ఎందుకు ఇంత మెతక వైఖరి?: పవన్ ఖేరా